మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి  పరిధిలోని టాటా నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం రాత్రి టాటా నగర్ లో ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ప్రమాదవశాత్తు భారీగా మంటలు చెలరేగాయి. సోఫాలకు సంబంధించిన రా మెటీరియల్ అంటుకోవడంతో  గోదాం మొత్తం మంటలు వ్యాపించాయి. 

పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతోపాటు దట్టమైన పొగ అలుముకోవడంతో  స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.  భారీ మంటలకు గోదాం ప్రహరీ కూడా కూలిపోయింది. ఎలక్ట్రికల్ స్తంభానికి ఉన్న వైర్ కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో రూ. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.