రకుల్ ప్రీత్ సింగ్ అపార్ట్ మెంట్‌లో అగ్ని ప్రమాదం

రకుల్ ప్రీత్ సింగ్ అపార్ట్ మెంట్‌లో అగ్ని ప్రమాదం

సినీ నటి  రకుల్ ప్రీతీ సింగ్ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం స‌మయంలో  రకుల్ త‌న నివాసం లేదు. షూటింగ్ కోసం  వేరే ప్రాంతంలో  ఉంది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.