నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం

నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం

నల్గొండ జిల్లా చెరువు గట్టు బ్రహ్మోత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది.  శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ఒక్కసారిగా  మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గురువారం (జనవరి 29) ఉదయం గుట్టపై మంటలు అంటుకోవడంతో భక్తులు పరుగులు తీశారు. 

గుట్టపై అంటుకున్న మంటలు.. చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు ఉండడంతో మరింతగా వ్యాపించాయి. అక్కడే ఉన్న నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు పోలీస్ సిబ్బందితో కలిసి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా మంటలను ఆర్పిన పోలీసులకు  భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఘటనపై ఆరా తీశారు డీఎస్పీ శివరామిరెడ్డి. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడిన ఎస్సై సైదా బాబు, సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్.