సీబీఐ ప్రధాన కార్యాలయంలో మంటలు

సీబీఐ ప్రధాన కార్యాలయంలో మంటలు

న్యూఢిల్లీ: సీబీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఢిల్లీలోని లోధీ రోడ్‌లో ఉన్న సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న సీబీఐ బిల్డింగ్‌ సెకండ్ బేస్‌మెంట్‌లో ఉన్నట్టుండి మంటలు వచ్చాయని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిందని ఉదయం 11.36 గంటలకు అక్కడి నుంచి ఫోన్ వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆరు ఫైరింజన్లతో స్టాప్‌కు చేరుకుని మంటలు ఆర్పామని చెప్పారు. బేస్‌మెంట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్, ఏసీ ప్లాంట్ గదుల్లో మంటలు వచ్చాయని, భారీగా పొగలు ఎగసిపడ్డాయని, అయితే ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అధికారులు వివరించారు. ఈ ఘటన గురించి తెలియగానే ఫైరింజన్లు, అంబులెలన్సులతో వేగంగా స్పాట్‌కు చేరుకున్నామని పోలీసులు చెప్పారు.