మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైల్లో చెలరేగిన మంటలు

మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైల్లో చెలరేగిన మంటలు

చిన్నశంకరంపేట, వెలుగు: బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన మెదక్ జిల్లా మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వద్ద శనివారం జరిగింది. నిజామాబాద్ వైపు నుంచి సికింద్రాబాద్​వైపు వస్తున్న గూడ్స్ రైలు బోగీలో నుంచి పొగలు వస్తున్న సమాచారం అక్కన్నపేట స్టేషన్ అధికారులు మిర్జాపల్లి స్టేషన్ అధికారులకు తెలిపారు.

ఈ మేరకు స్టేషన్ మాస్టర్ ప్రసన్నకుమార్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఫైరింజన్ తో మిర్జాపల్లి స్టేషన్ కు చేరుకుని మంటలు ఆర్పి వేశారు. మంటలను ఆర్పివేసేందుకు గంట పాటు శ్రమించాల్సి వచ్చిందని స్టేషన్ మాస్టర్ తెలిపారు. బొగ్గువేడికి, గాలి తోడైతే మంటలు చెలరేగే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.