ప్రాణ భయంతో నాలుగో ఫ్లోర్ నుంచి ఇలా దూకేశాడు.. కింద పడి బతికాడా లేదా..?

ప్రాణ భయంతో నాలుగో ఫ్లోర్ నుంచి ఇలా దూకేశాడు.. కింద పడి బతికాడా లేదా..?

గదిలో వేసి పిల్లిని కొట్టినా పులిలా తిరగబడుతుంది.. అలాంటిది కళ్ల ముందు ప్రాణం పోతుంది.. ఒక బతకను అనుకున్నప్పుడు.. చావో రేవో తేల్చుకుంటారు.. ఇక్కడ ఉంటే కచ్చితంగా చచ్చిపోతాను అనుకున్నప్పుడు.. ఉన్న ఆప్షన్స్ వెతుక్కుని.. అప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవటం అనేది దైర్యవంతుల లక్షణం అంటారు సైకాలజిస్టులు.. తీసుకుని ఆప్షన్ అనేది కూడా ప్రాణాలను కాపాడుతుందా లేదా అనేది తర్వాత విషయం.. ఇక్కడ ఉంటే కచ్చితంగా చావు అయితే గ్యారెంటీ కదా అనే విధంగా ఆలోచించి.. మన బెంగళూరులోని ఓ వ్యక్తి చేసిన సాహసం.. ఇప్పుడు అతన్ని ప్రాణాలతో నిలబెట్టింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని ఓ కమర్షియల్ బిల్డింగ్ పై అంతస్తులో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి ఆరు అగ్నిమాపక దళ వాహనాలు హుటాహుటిన చేరుకున్నాయి. భవనం పైకప్పుపై హక్కా బార్, మడ్‌పైప్ కేఫ్‌గా ఓ పబ్ నిర్వహిస్తున్నట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పబ్ అండ్ రెస్టారెంట్‌లోని కిచెన్‌లో ఉంచిన సిలిండర్‌లో పేలుడు సంభవించడంతో మంటలు విస్తృతంగా వ్యాపించినట్టు సమాచారం.

ఈరోజు (అక్టోబర్ 18) ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. రెస్టారెంట్ పై అంతస్తులో నిండుగా ఉన్న సిలిండర్లను ఉంచారని, అందులో ఒక సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయని ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ ఏడీజీపీ హెచ్ హరిశేఖరన్ తెలిపారు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే మరో మూడు నాలుగు సిలిండర్లు పేలి, మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.

ALSO READ : రాజ‌మండ్రి బ్రిడ్జ్పై ట్రైన్ సీన్ ఎలా ఉంటుందో.. రివీల్ చేసిన డైరెక్టర్ వంశీ
 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. మంటల్లో చిక్కుకున్న ఓ యువకుడు భయంతో నాలుగో అంతస్తు నుంచి దూకాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి బతికే ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో కేఫ్ పూర్తిగా దగ్ధమైంది. దాని కిందే ఉన్న కల్ట్ ఫిట్ అనే జిమ్ కూడా చాలా నష్టపోయింది. పేలుడు సంభవించిన తర్వాత, సిలిండర్‌లోని కొన్ని ముక్కలు బౌన్స్ అయి కింద పడిపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్క్ చేసిన కొన్ని బైక్‌లు, కార్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మడ్‌పైప్ కేఫ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.