
బీహార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ముజఫర్ పూర్ పరిధిలోని అహియాపూర్ స్లమ్ ఏరియాలో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో గుడిసెలన్నిటికీ మంటలు అంటుకున్నాయి. భయాందోళనకు గురైన జనం పిల్లలతో కలిసి గుడిసెల నుంచి బయటకు పరుగులు తీశారు. మొత్తం 150 వరకు గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంతో గుడిసెల్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అనుమానిత వ్యక్తులు అగ్గి పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.