బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం

బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం
  •  మొదటి అంతస్తులోని హోటల్​లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు

పంజాగుట్ట/సికింద్రాబాద్, వెలుగు : బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం లైఫ్ స్టైల్ బిల్డింగ్ మొదటి అంతస్తులోని హోటల్ కిచెన్ లో దట్టమైన పొగతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని బిల్డింగ్​ను ఖాళీ చేయించారు. మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కిచెన్​లో గ్యాస్ లీకేజ్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.