మసీదులో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన డోమ్‌

మసీదులో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన డోమ్‌

ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఇస్లామిక్ సెంటర్ గ్రాండ్ మసీదులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మసీదు డోమ్‌ కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మసీదు డోమ్‌ పునరుద్ధరించే సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. కాగా, ప్రమాద సమయంలో మసీదులో పున:నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. 

ఇస్లామిక్‌ సెంటర్‌ ఆవరణలో పలు విద్యా సంస్థలు, వాణిజ్య కేంద్రాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోడు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గోపురం కూలిపోయే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.