తైవాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 46 మంది సజీవ దహనం

V6 Velugu Posted on Oct 14, 2021

కావోసియుంగ్: తైవాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ తైవాన్‌లోని కావోసియుంగ్ సిటీలో 13 అంతస్తుల ఓ టవర్‌లో తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 46 మంది మృతి చెందారు. ప్రస్తుతం 79 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 40 సంవత్సరాల కింద నిర్మించిన ఈ భవనం కింద షాపింగ్ కాంప్లెక్స్​లు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

ప్రమాదానికి గురైన టవర్‌లో మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి సుమారు నాలుగు గంటలు పట్టింది. మంటలు చెలరేగే ముందు పేలుడు జరిగినట్లు ఒక పెద్ద శబ్దం వచ్చిందని చుట్టుపక్కల ఉండే స్థానికులు వివరించారు. ఈ టవర్‌లో దాదాపు 120 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో నివసిస్తున్నవారిలో చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ చేపట్టేందుకు ఇప్పటికే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మరిన్ని వార్తల కోసం:

అక్టోబర్ 20 వరకు ఆర్యన్ ఖాన్ జైల్లోనే..

‘మా’ ఎలక్షన్ సీసీటీవీ ఫుటేజీ ఇవ్వండి: ప్రకాశ్ రాజ్

మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి: ఎన్‌సీబీ

Tagged fire accident, dead, Injured, Taiwan, Firefighters

Latest Videos

Subscribe Now

More News