అక్టోబర్ 20 వరకు ఆర్యన్ ఖాన్ జైల్లోనే..

V6 Velugu Posted on Oct 14, 2021

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్‌‌కు గురువారం కూడా బెయిల్ లభించలేదు. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ఇరు వైపుల వాదనలను విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నెల 20న కోర్టు తీర్పును వెలువర్చనుంది. అప్పటి వరకు ఆర్యన్ జైలులోనే ఉండనున్నాడు. కాగా, ఇవ్వాళ వాదనల సమయంలో ఆర్యన్ చాన్నాళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాడని ఎన్‌సీబీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే ఆర్యన్‌ తరఫు లాయర్ అమిత్ దేశాయ్ మాత్రం భిన్నమైన వాదనలు చేశారు. అసలు ఆర్యన్ క్రూయిజ్ షిప్‌లో లేడని.. అతడి దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని అన్నారు. కాగా, ఈ నెల 3న ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఈ రెయిడ్స్‌లో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అతడితోపాటు మరో 8 మందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది.  

మరిన్ని వార్తల కోసం:

‘మా’ ఎలక్షన్ సీసీటీవీ ఫుటేజీ ఇవ్వండి: ప్రకాశ్ రాజ్

మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి: ఎన్‌సీబీ

బాలీవుడ్ హీరోయిన్లకు ఈడీ సమన్లు

Tagged Drugs Case, ncb, bail plea, aryan khan, mumbai sessions court, Drugs Consumption

Latest Videos

Subscribe Now

More News