మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి: ఎన్‌సీబీ

మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి: ఎన్‌సీబీ

ముంబై: ఆర్యన్ ఖాన్ తరచూ డ్రగ్స్ తీసుకునే వాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఆరోపించింది. గత కొన్నేళ్లుగా అతడు రెగ్యులర్‌గా డ్రగ్స్ తీసుకుంటున్నాడని, దీనికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ముంబై హైకోర్టుకు ఎన్సీబీ తెలిపింది. ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్‌సీబీ తరఫు న్యాయవాది పైవ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్యన్ తరఫు న్యాయవాది అయిన అమిత్ దేశాయ్ చేస్తున్న వాదనలు మరో విధంగా ఉన్నాయి. అసలు ఆర్యన్ క్రూయిజ్ షిప్‌లో లేడని.. అతడి దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని అమిత్ అంటున్నారు. కాగా, ఈ నెల 3న ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఈ రెయిడ్స్‌లో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అతడితోపాటు మరో 8 మందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది.  

మరిన్ని వార్తల కోసం:

బాలీవుడ్ హీరోయిన్లకు ఈడీ సమన్లు

దుర్గ పూజలో ముస్లిం యువకులు

బీఎస్ఎఫ్ పరిధి పెంపు.. భగ్గుమంటున్న ప్రభుత్వాలు