వైరల్ వీడియో: సముద్రంలో మంటలు.. ఆర్పుతున్న నౌకలు

వైరల్ వీడియో: సముద్రంలో మంటలు.. ఆర్పుతున్న నౌకలు

అదో పెద్ద సముద్రం. కనుచూపు మేర ఎటుచూసినా నీళ్లే. కానీ, ఆ నీళ్లలో భారీ మంటలు. అదేంటి నీళ్లలో మంటలు ఎలా అనుకుంటున్నారా? అయితే అది ఎలా జరిగిందో చూద్దాం. 

మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో పెమెక్స్ అనే చమురు సంస్థ ఉంది. ఆ కంపెనీ రోజువారీగా దాదాపు 1.7 మిలియన్ బారెల్స్ చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే మెక్సికోలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల చమురు యంత్రాలు దెబ్బతిన్నాయి. దాంతో సముద్రం లోపలి నుంచి చమురును రవాణా చేసే పైప్‌లైన్ దెబ్బతింది. దాంతో గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు గ్యాస్ లీక్ జరిగి మంటలు చెలరేగాయని చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బంది.. నౌకలతో మంటలపై నీటిని చల్లి ఉదయం 10:30 గంటల వరకు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను పూర్తిగా ఆర్పివేయడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలను పరిశీలిస్తామని సిబ్బంది తెలిపారు. మంటలను నియంత్రించడానికి నత్రజనిని ఉపయోగించినట్లు నౌకా సిబ్బంది తెలిపారు.