ఐపీఎల్‌లో తొలిసారి అమెరికన్‌ ప్లేయర్

ఐపీఎల్‌లో తొలిసారి అమెరికన్‌ ప్లేయర్

కేకేఆర్​ టీమ్‌‌లోకి అలీ ఖాన్‌‌

అబుదాబి: ఐపీఎల్‌‌ హిస్టరీలోనే తొలిసారి ఓ అమెరికా క్రికెటర్​ లీగ్‌‌లో ఆడబోతున్నాడు. కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ (కేకేఆర్​) యూఎస్‌‌ఏకు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్‌‌ బౌలర్​ అలీ ఖాన్‌‌ను  తమ టీమ్‌‌లోకి తీసుకోనుంది.  భుజం గాయం కారణంగా లీగ్‌‌కు దూరమైన హ్యారీ గర్నీకి రీప్లేస్‌‌మెంట్‌‌గా అలీని ఎంపిక చేసింది. దీనికి ఐపీఎల్‌‌ జీసీ నుంచి అప్రూవల్‌‌ రావాల్సి ఉంది  కరీబియన్‌‌ ప్రీమియర్​ లీగ్‌‌లో టైటిల్‌‌ నెగ్గిన కేకేఆర్ ఫ్రాంచైజీ..  ట్రిన్‌‌బాగో నైట్‌‌రైడర్స్‌‌ (టీకేఆర్​) టీమ్‌‌లో అలీ ఖాన్‌‌ కూడా ఉన్నాడు. ఆ లీగ్‌‌లో ఎనిమిది మ్యాచ్‌‌ల్లో ఆడిన ఖాన్‌‌ 7.43 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. లాస్ట్‌‌ ఇయర్​ నుంచే అతడిని ఐపీఎల్‌‌లోకి తీసుకోవాలని కేకేఆర్​ భావించినా వర్కౌట్‌‌ కాలేదు. 140 కి.మీ. స్పీడ్‌‌తో బంతులు వేయడంతో పాటు స్లాగ్‌‌ ఓవర్లలోనూ బౌలింగ్‌‌ చేసే ఖాన్‌‌ మంచి యార్కర్లు సంధిస్తాడు. 2018లో కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20లో ఖాన్‌‌ పెర్ఫామెన్స్‌‌ చూసి వెస్టిండీస్‌‌ ఆల్‌‌రౌండర్​ డ్వేన్‌‌ బ్రావో..  సీపీఎల్‌‌లో తన నైట్‌‌ రైడర్స్‌‌ టీమ్‌‌లో చాన్సిచ్చాడు. ఈ లీగ్‌‌లో తన ఫస్ట్‌‌ బాల్‌‌కే  శ్రీలంక లెజెండ్‌‌ కుమార సంగక్కరను ఔట్‌‌ చేసి ఔరా అనిపించాడు అలీ ఖాన్‌‌.

For More News..

జాబ్​ పోయినోళ్లకు కూడా సగం జీతం: లేబర్ మినిస్ట్రీ

ట్యాక్స్​ లెక్కల్లో తేడాలున్నయని​ 5 కోట్లు లంచం అడిగిన్రు

రోడ్డు మధ్యలో మంత్రి ప్రోగ్రాం.. దారి మళ్లిన అంబులెన్స్

రెండున్నరేళ్ల కిందటి ‘రైతుబంధు’ ఇప్పుడిచ్చిన్రు