సౌతాఫ్రికా టీ20లీగ్లో తొలి సెంచరీ

సౌతాఫ్రికా టీ20లీగ్లో తొలి సెంచరీ

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. జోబర్డ్ సూపర్ కింగ్స్ టీమ్‌ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ శతకం బాదాడు. డర్బన్స్ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 86 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్ లో మొదటి సెంచరీ చేసిన క్రికెటర్ గా డూ ప్లెసిస్ చరిత్రకెక్కాడు. 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్స్ సూపర్ జెయింట్స్  20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్ (65) హాఫ్ సెంచరీ చేశాడు.  జాసన్ హోల్డర్(28 నాటౌట్) రాణించాడు. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి విజయం సాధించింది. డుప్లెసిస్ ఫాస్టెస్ట్  సెంచరికి తోడుగా ఓపెనర్ రిజా హెండ్రీక్స్(45)తో  రాణించాడు.