IPL2023 : రేపే తొలి పోరు.. ఢిఫెండింగ్ ఛాంపియన్ VS ఐపీఎల్ ఛాంపియన్

IPL2023 : రేపే తొలి పోరు.. ఢిఫెండింగ్ ఛాంపియన్ VS ఐపీఎల్ ఛాంపియన్

క్రికెట్ సంబరం మళ్లీ వచ్చింది. ఐపీఎల్ 2023కి రంగం సిద్ధం అయింది. కరోనా వల్ల గత మూడు సీజన్లు ఆంక్షల మధ్య జరిగాయి. అయితే, ఈ టోర్నీతో  మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకుండా వేసవి విందు అందనుంది. రేపు (మార్చి 31) అహ్మదాబాద్, మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఐపీఎల్ 2023కి తెరలేవనుంది. రేపు జరిగే తొలిపోరులో ఢిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది.

ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొన బోతున్నాయి. 12 నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. లీగ్ స్టేజ్ లో ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడుతుంది. అంటే ఈ సీజన్ లీగ్ మొత్తంలో 70 మ్యాచులు జరుగనున్నాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ కలిపి మొత్తం 74 మ్యాచులు జరుగుతాయి. ఈ సీజన్ లో మళ్లీ ఇంటా, బయట మ్యాచులు జరుగనున్నాయి. దీంతో జట్లకు హోం టీం సపోర్ట్ కొంత అందనుంది. 

అయితే, ప్లే ఆఫ్స్ ( క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 ) మూడు మ్యాచ్ లకు సంబంధించిన తేదీ, వేదికలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా తొందరలోనే బీసీసీఐ ప్రకటిస్తుంది.

మరిన్ని వార్తలు