
విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మొదటి పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘గుల్లెడు గుల్లెడు’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇద్దరి మధ్య సాగే మెలోడీ సాంగ్‌ను జేక్స్ బిజోయ్ కంపోజ్ చేశాడు. ఇదొక ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది.