GT vs KKR : సీజన్లో తొలి హాట్రిక్... కష్టాల్లో కోల్కత్తా

GT vs KKR : సీజన్లో తొలి హాట్రిక్... కష్టాల్లో కోల్కత్తా

దాటిగా ఆడుతున్న కోల్ కత్తాను రషీద్ ఖాన్ దెబ్బ కొట్టాడు. హాట్రిక్ వికెట్లు తీసి కోల్ కత్తాను పీకల్లోతు కష్టాల్లో పడేశాడు. 17 ఓవర్ వేసిన రషీద్ ఖాన్.. మొదటి బంతికే రస్సె్ల్ ను పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన నరైన్.. షార్దూల్ ఠాకూర్ లను ఔట్ చేసి ఈ సీజన్ లో మొదటి హాట్రిక్ సాధించాడు. 

దాటిగా ఆడుతున్న వెంకటేష్ అయ్యర్(83, 40 బంతుల్లో)ను అల్జారీ జోసెఫ్ పడగొట్టాడు. దీంతో కోల్ కత్తా వికెట్ల పతనం ప్రారంభం అయింది. ఆ తర్వాత ఓవర్ వేసిన రషీద్ హాట్రిక్ తో కీలక బ్యాట్స్ మెన్ ను ఔట్ చేశాడు. ప్రస్తుతం కోల్ కత్తా గెలుపుకు 17 బంతుల్లో 48 పరుగులు కావాలి. క్రీజ్ లో రింకు సింగ్ (5), ఉమేష్ యాదవ్ ఉన్నారు.