
కొన్నేళ్లుగా ‘బిచ్చగాడు’ స్థాయి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇందుకోసం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఈసారి మరో క్రైమ్ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు. ‘తమిళ్ పడం’ (‘సుడిగాడు’ ఒరిజినల్) అనే కామెడీ సిరీస్‌లో రెండు సినిమాలు చేసిన సీఎస్ అముదన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల టైటిల్‌ను అనౌన్స్ చేశారు. తమిళంలో ‘రత్తం’ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాగా పెరిగిన గడ్డం, చేతికి కట్టుతో శాడ్ లుక్‌లో కనిపించాడు విజయ్. మహిమా నంబియార్, నందిత శ్వేత, రమ్యా నంబీశన్ హీరోయిన్స్. కమెడియన్ జగన్ కృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోల్‌కత్తాలో ఉండనుంది. ఫిబ్రవరి వరకూ షూటింగ్ పూర్తిచేసి, సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కమల్ బోరా, లలితా ధనుంజయన్, బి.ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్.విక్రమ్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు. ఇదికాక మరో ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు విజయ్ ఆంటో