ఈ కుంభకర్ణుడు.. పడుకుంటే పోతాడు!

ఈ కుంభకర్ణుడు.. పడుకుంటే పోతాడు!

కమెడియన్‌‌ నుంచి హీరోగా, హీరో నుంచి విలన్‌‌గా టర్న్‌‌ అయిన సునీల్.. ఇటీవల ‘పుష్ప’లోని మంగళం శీను పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు ‘మర్యాద కృష్ణయ్య’ లాంటి చిత్రాల్లో హీరోగానూ నటిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా మరో కొత్త చిత్రానికి కమిటయ్యాడు. అభిరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘కుంభకర్ణ’ అనే టైటిల్‌‌ ఫిక్స్ చేశారు. రామాయణంలో కుంభకర్ణుడు ఏ స్థాయిలో నిద్రపోతాడో తెలిసిందే. కానీ ఇందులో సునీల్ పాత్ర రివర్స్‌‌లో ఉంటుందట. అతను నిద్రపోతే చనిపోతాడట. అందుకే ‘పడుకుంటే పోతాడు’ అనే ట్యాగ్‌‌లైన్ పెట్టారు. ఈ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ రెగ్యులర్ షూట్‌‌ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు. కబీర్ దుహాన్‌‌సింగ్ విలన్‌‌గా నటిస్తున్నాడు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.