లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీం

లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీం

అనుష్క, నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేష్‌‌ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌‌ను విడుదల చేశారు. రధన్ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. ఎమ్ఎమ్ మానసి పాడింది.  ‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ.. పెద్ద అడుగే వేసిందే.. పద్ధతులన్నీ సంకెళ్లంటూ తెంచుకుంటూ నడిచిందే.. సన్నాయే వద్దంటా.. మంత్రాలొద్దంటా..పేరంటాలే పడదంటా..’ అంటూ సాగిన పాట అనుష్క  క్యారెక్టరైజేషన్‌‌ను తెలియజేసేలా ఉంది. స్నేహం, మోహం, బంధం, అనుబంధం ఏవీ వద్దనుకునేలాంటి పాత్రలో అనుష్కశెట్టి నటిస్తోందని ఈ పాట చూస్తే అర్థం అవుతోంది. ఇందులో ఆమె అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌‌ పాత్రలో నటిస్తోంది. సిద్ధు అనే స్టాండప్ కమెడియన్‌‌గా నవీన్ పోలిశెట్టి కనిపించనున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.