దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్​ హైడ్రోజన్​ పైలట్​ ప్రాజెక్ట్​

దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్​ హైడ్రోజన్​ పైలట్​ ప్రాజెక్ట్​

జాతీయ గ్రీన్​ హైడ్రోజన్​ మిషన్​లో భాగంగా దేశంలో తొలిసారిగా హిమాచల్​ప్రదేశ్​లోని జాక్రిలో బహుళ ప్రయోజనం గల 1500 మెగావాట్ల నాథ్​పా జాక్రి హైడ్రో పవర్​ స్టేషన్​ (ఎన్​జేహెచ్​పీఎస్​)లో గ్రీన్​ హైడ్రోజన్​ పైలట్​ ప్రాజెక్టును సట్లెజ్​ జల్​ విద్యుత్ నిగమ్​ లిమిటెడ్ ప్రారంభించింది. 


విద్యుత్ రంగంలో గ్రీన్​ హైడ్రోజన్​ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం అవుతుంది. దీనివల్ల శుద్ధమైన ఇంధన ఉత్పత్తిలో గ్రీన్​ హైడ్రోజన్​ కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే గ్రీన్​ హైడ్రోజన్​ను ఎస్​జేవీఎన్​ నెలకొల్పిన హై వెలాసిటీ ఆక్సిజన్​ ఫ్యూయల్​(హెచ్​వీఓఎఫ్​) కోటింగ్​ ఫెసిలిటీ ఇంధన అవసరాల కోసం ఉపయోగిస్తారు.

అంతేకాకుండా 25 కిలోవాట్ల సామర్థ్యం గల ఫ్యూయెల్​ సెల్​ ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. 
 గ్రీన్​ హైడ్రోజన్​ పైలట్​ ప్రాజెక్ట్​ 8 గంటల సమయంలో నిత్యం 14 కిలోగ్రాముల గ్రీన్​ హైడ్రోజన్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్టు 20 ఎన్​ఎం 3/ గంటలు సామర్థ్యం గల ఆల్కలీన్​ ఎలక్ట్రోలైజర్​ను ఉపయోగించి హైడ్రోజన్​ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి అవసరమైన ఇంధనం సిమ్లాలోని వధాల్​లో ఎస్​జేవీఎన్​ నెలకొల్పిన 1.31 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నుంచి పునరుత్పాదక శక్తిగా సరఫరా అవుతుంది.