దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ (SIR) ఫస్ట్ ఫేజ్ పూర్తయిందని కేంద్రం ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తెలిపారు. సోమవారం (అక్టోబర్ 27) ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కారాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఫస్ట్ పేజ్ పూర్తయిందని.. అక్టోబర్ 28 నుంచి సెకండ్ ఫేజ్ లో 12 రాష్ట్రాల్లో SIR ప్రారంభం అవుతుందని చెప్పారు. అందులో భాగంగా BLO లకు రేపటి నుంచే (అక్టోబర్ 28) ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు.
ఫస్ట్ ఫేజ్ లో భాగంగా బీహార్ లో విజయవంతంగా పూర్తి చేశామని సీఈసీ చెప్పారు. బీహార్ లో తొలగించిన ఓట్లపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని అన్నారు. బీహార్ లో 7.5 కోట్ల మంది SIR లో పాల్గొన్నారని తెలిపారు.
దేశంలో చివరి సారిగా 21 ఏళ్ల క్రితం SIR జరిగిందని కేంద్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. నకిలీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా SIR చేపట్టినట్లు తెలిపారు. బూత్ స్థాయి నుంచే ఓటర్ల జాబితా ప్రక్షాళన ఉంటుందని.. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
►ALSO READ | Adani LIC Issue: అదానీ.. LIC వివాదం ఏంటీ.. అసలు ఏం జరిగింది..? పూర్తి వివరాలు
దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణలో భాగంగా ఫేజ్ 2 లో 12 రాష్ట్రాల్లో SIR చేపట్టనున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా BLO లు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. అక్టోబర్ 28 నుంచి బూత్ స్థాయి ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తామని.. మూడు సార్లు ఓటర్ లిస్టు చెక్ చేస్తారని చెప్పారు. సరైన పత్రాలు ఉంటే ఓటుహక్కు కల్పిస్తున్నట్లు తెలిపారు. SIR తర్వాత అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. తొలగించిన ఓట్ల లిస్టును గ్రామ కార్యాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు.
