కరోనా టాబ్లెట్ కు బ్రిటన్ ఆమోదం

కరోనా టాబ్లెట్ కు బ్రిటన్ ఆమోదం

రెండు వేవ్ లతో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారికి మందు అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరప్యూటిక్స్ అనే సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ మోల్నుపిరవిర్ కు బ్రిటన్ ఆమోదం తెలిపింది. బ్రిటన్ కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ మోల్నుపిరవిర్ క్యాప్స్యూల్స్ కు అప్రూవల్ ఇచ్చింది. దీంతో కరోనా ట్రీట్మెంట్ లో పిల్స్ కు పర్మిషన్ ఇచ్చిన మొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులోకి రావడంతో... కరోనాపై పోరాటం మరింత సులభం కానుంది. ఈ నెలాఖరులో అమెరికా కూడా మోల్నుపిరవిర్ ఉపయోగంపై నిర్ణయం తీసుకోనుంది.