రెండు నెలల్లో ఇండియాకు రాఫెల్

రెండు నెలల్లో ఇండియాకు రాఫెల్

న్యూ ఢిల్లీ: మరో రెండు నెలల్లో రాఫెల్ యుద్ధ విమానం ఇండియా గడ్డపై అడుగుపెట్టనుంది. మొదటి రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఇండియాకు రెండు నెలల్లో అందిస్తామని ఫ్రెంచ్​ అంబాసిడర్ అలెగ్జాండర్ జిగ్లర్ శుక్రవారం ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో ఒప్పందం ప్రకారం మొత్తం 36 జెట్ విమానాల్ని అందజేస్తామని తెలిపారు. రాఫెల్ అద్భుతమైన టెక్నాలజీతో.. ఫీచర్లు కలిగివుందని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కెపాసిటీని  మరింత పెంచుతుందని అన్నారు. అనుకున్న సమయానికి సెప్టెంబర్ లో కచ్చితంగా రాఫెల్ ను ఇండియాకు అందిస్తామన్నారు.