
- దేశంలో మొదటి రోడ్డు రవాణా సంస్థ నిజాం రాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్టు డిపార్ట్మెంట్.
- - హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయ రహదారులను 1932లో జాతీయం చేశారు.
- 1936 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్ డిపోలను అందుబాటులోకి తెచ్చారు.
- నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 1951లో హైదరాబాద్ రాష్ట్రంలో
- విలీనమైంది.
- 1958లో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడింది.
- ఏపీఎస్ఆర్టీసీ నుంచి టీఎస్ఆర్టీసీ 2015లో విడిపోయింది.
- తెలంగాణలో మొదటి రోడ్డు మార్గం హైదరాబాద్ – షోలాపూర్ మార్గం.
- 2022 సోషియో ఎకనమిక్ ఔట్లుక్ ప్రకారం తెలంగాణలో మొత్తం రహదారుల పొడవు 1,07,871 కి.మీ.
- 2022 సోషియో ఎకనమిక్ ఔట్లుక్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జాతీయ రహదారుల పొడవు 3910 కి.మీ.
- తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జాతీయ రహదారుల సంఖ్య 25.
- తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్ – 44.
- జాతీయ రహదారి ఎన్‌హెచ్–44 తెలంగాణ రాష్ట్రంలో 512.65 కి.మీ.లు ప్రయాణిస్తుంది.
- జాతీయ రహదారి–44 మొత్తం పొడవు 4112 కి.మీ.
- దేశంలో మొదటి రోడ్ల అభివృద్ధి ప్రణాళిక నాగపూర్ ప్రణాళిక.
- తెలంగాణలో అతి చిన్న జాతీయ రహదారి ఎన్‌హెచ్–150.
- ఎన్‌హెచ్–44, ఎన్‌హెచ్–65 తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో కలుస్తాయి.
- తెలంగాణలో అతి పొడవైన రాష్ట్ర రహదారి
- ఎస్‌హెచ్–1.
- తెలంగాణలో అతి చిన్న రాష్ట్ర రహదారి
- ఎస్‌హెచ్–9.
- తెలంగాణలో అతి పెద్ద బస్ స్టేషన్ అయిన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ 1994లో నిర్మించారు.
- మహాత్మాగాంధీ బస్ స్టేషన్ మూసీ నది
- ఒడ్డున ఉంది.
- రాష్ట్రంలో మొదటి రైలు మార్గం 1874లో
- ప్రారంభమైంది.
- తెలంగాణ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం సికింద్రాబాద్ – వాడి.
- సికింద్రాబాద్ – విజయవాడ రైల్వే మార్గం 1886లో పూర్తయింది.
- దక్షిణ మధ్య రైల్వేను సికింద్రాబాద్ కేంద్రంగా 1966లో ప్రారంభించారు.
- నాంపల్లి రైల్వేస్టేషన్‌ను 1907లో
- ప్రారంభించారు.
- నాంపల్లి అంటే ఉర్దూ భాషలో చిత్తడి
- ప్రాంతం అర్థం ఉంది.
- కాచీగూడ రైల్వే స్టేషన్‌ను 1916లో
- ప్రారంభించారు.
- దేశంలో మొదటి మహిళా రైల్వే స్టేషన్ ముంబై – మాతుంగా రైల్వే స్టేషన్.
- తెలంగాణలో మొదటి మహిళా రైల్వే స్టేషన్ బేగంపేట రైల్వేస్టేషన్.
- హైదరాబాద్‌లో మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌ను 2003లో ప్రారంభించారు.
- హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో మొదటి దశను 2017లో ప్రారంభించారు.
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొత్తం పొడవు 69.2 కి.మీ.లు.
- మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా శ్రీధరన్‌ను పిలుస్తారు.
- స్వాతంత్ర్యానికి ముందు దేశంలో విమానాశ్రయాన్ని కలిగి ఉన్న ఏకైక సంస్థానం నిజాం సంస్థానం.
- తెలంగాణలో మొదటి విమానాశ్రయం మామునూరు విమానాశ్రయం.
- దేశంలో మొదటి విమానాశ్రయాన్ని 1936లో ప్రారంభించారు.