
‘నా పేరు శివ’ ఫేమ్ వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రాకేష్ వర్రే నిర్మించిన చిత్రం ‘పేక మేడలు’. జులైలో సినిమా విడుదల కానుంది. శనివారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
స్మరణ్ సాయి కంపోజ్ చేసిన ఈ పాటకు భార్గవ్ కార్తీక్ లిరిక్స్ రాయగా, మనో పాడిన తీరు ఆకట్టుకుంది. ‘లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చారో లచ్చన్నా.. చిల్లిగవ్వ లేని నీకు బ్లాంకు చెక్కు బుక్కు చేతికి చిక్కేరో లచ్చన్న..’ అంటూ సాగే పాటతో వినోద్ కిషన్ పాత్ర ఎలా ఉంటుందో చూపించడం ఆకట్టుకుంది. మంచి కాన్సెప్ట్, కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.