ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌ విడుదల

ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌ విడుదల

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. బుధవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను విడుదల చేశారు.

ఇందులో విజయ్ ఫ్యామిలీ మేన్‌‌‌‌లా కనిపించిన తీరు ఆకట్టుకుంది.   ‘నందనందనా..’ అనే పల్లవితో మొదలైన ఈ పాటను గోపీ సుందర్ కంపోజ్ చేయగా, సిద్ శ్రీరామ్ పాడిన విధానం స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచింది.

‘ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా.. ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చీ గిచ్చక.. ప్రాణాన్ని గుచ్చీ గుచ్చక.. చిత్రంగా చెక్కింది దేనికో..’ అంటూ అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలో విజయ్, మృణాల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హైదరాబాద్‌‌‌‌లోని ఛార్మినార్ సహా పలు లొకేషన్స్, మెట్రో ట్రైన్‌‌‌‌లో ఈ సాంగ్‌‌‌‌ను షూట్ చేసినట్టు విజువల్స్‌‌‌‌లో చూపించారు.