భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో తొలిసారి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో తొలిసారి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ

భద్రాచలం, వెలుగు : సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం కల్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తొలిసారిగా ల్యాప్రోస్కోపిక్​ ద్వారా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరకు చెందిన రమణ అనే  పేషెంట్​కు గాల్​బ్లాడర్​(పిత్తాశయం)లో ఉన్న రాళ్లను ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసి తొలగించారు. 

మారుమూల ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఈ తరహా అధునాతన వైద్యం అందించడం పట్ల పేషెంట్​ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్​డాక్టర్​ రామకృష్ణ, డాక్టర్​ వెంకట్​ తదితరులు ఈ సర్జరీని నిర్వహించారు.