షుగర్​ని  కనిపెట్టే చిప్​

షుగర్​ని  కనిపెట్టే చిప్​

ఫోన్ల నుంచి టీవీలు, వాచీల వరకు అంతా స్మార్ట్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. వర్చువల్ రియాలిటీ డివైజ్​ల వాడకం పెరుగుతోంది. అందుకు తగ్గట్టే టెక్ కంపెనీలు కూడా ప్రొడక్ట్స్ తయారుచేస్తున్నాయి. స్నాప్​చాట్ డ్రోన్ కెమెరా,  గూగుల్ ప్లే సర్వీసెస్​ ‘సెల్ఫ్​ షేర్’ ఫీచర్​,  డయాబెటిస్ నుంచి కాపాడే అల్ట్రాహ్యూమన్ చిప్... ఇవన్నీ కొత్తగా వచ్చినవే. ఇవేకాకుండా ఈవారం మరిన్ని టెక్నాలజీ అప్​డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే.. ఇది చదివేయండి.

‘అల్ట్రాహ్యూమన్’ అనే ఫిట్​నెస్ టెక్ స్టార్టప్​ ఈమధ్య కొత్త చిప్​ తీసుకొచ్చింది. ఈ చిప్​ పేరు ‘అల్ట్రాహ్యూమన్ సైబోర్గ్​’. ఇది మెటబాలిజం తీరును గమనించి, డయాబెటిస్ బారిన పడకుండా కాపాడుతుంది. అదెలాగంటే... ఇందులో బయోసెన్సర్ ఉంటుంది. ఈ చిప్​ని మోచేతిపైన పెట్టుకోవాలి. ఇందులోని సెన్సర్ ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర ఎంత ఉంది? అనేది చెప్తుంది. ఇదే సమాచారాన్ని ఐఫోన్​లోని అల్ట్రాహ్యూమన్ యాప్​కి పంపిస్తుంది. దాంతో, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డయాబెటిస్ బారిన పడకుండా చూసుకోవచ్చు.