దహెగాం, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్గ్యాంగ్లోని ఐదుగురిని అరెస్ట్‌చేసి రూ.65,270 స్వాధీనం చేసుకున్నట్టు దహెగాం సీఐ రాణాప్రతాప్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లా దహెగాం మండలం ఐనం గ్రామంలో అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పెరుగు వినోద్, గోమాస హరిదాస్, జుమ్మిడి వసంత్, కొండగుర్ల నాగేందర్, దుర్గం వెంకటేశ్ ను అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నగదు తోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 1 –100 వరకు టోకెన్లను ఉపయోగించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లైవ్ వీడియోలు పోస్ట్ చేస్తూ, టోకెన్లకు భారీగా ప్రైజ్ మనీ వస్తుందని ప్రజలను నమ్మిస్తున్నారు. ప్రతి టోకెన్ సుమారు రూ.1000 చొప్పున అమ్ముతున్నారు. సీఐ రాణా ప్రతాప్‌తో పాటు ఎస్ఐ రాజు కందూరి, పోలీసు సిబ్బంది మహ్మద్, విజయ్, రమేశ్, శేఖర్ ఉన్నారు.
