కొండపాక: నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమి విక్రయం...వివాదం సృష్టించి మరో రూ.40 లక్షలు వసూలు

కొండపాక: నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమి విక్రయం...వివాదం సృష్టించి మరో రూ.40 లక్షలు వసూలు
  •     ఐదుగురు నిందితులు అరెస్ట్

కొండపాక, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. సిద్దిపేట త్రీ టౌన్​ సీఐ లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమికి జక్కుల రాజు, హరేందర్​, దేవాసి, సోలంకి, దానారం అనే వ్యక్తులు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు సృష్టించారు. 

2022లో ఆ భూమిని ఎడ్ల జ్యోతి–శ్రీనివాసరెడ్డి దంపతులకు రూ.7 లక్షలకు విక్రయించారు. అనంతరం భూమిపై వివాదం సృష్టించి, బాధితులను బెదిరించి అదనంగా రూ.40 లక్షలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.