వర్షాలకు కూలిన ఇల్లు..ఐదుగురు మృతి

వర్షాలకు కూలిన ఇల్లు..ఐదుగురు మృతి

బెంగళూరు : భారీ వర్షానికి ఇల్లు కూలడంతో..ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. ఈ సంఘటన కర్ణాటక జిల్లాలో జరిగింది. కొన్ని రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పలు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

ఈ క్రమంలోనే కర్ణాటకలోని కొడ్గవ్ జిల్లాలోని బాగమందల సమీపంలో ఓ ఇల్లు కూలిపోవడంతో ..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.  మృతులను యశ్వంత్, బాలకృష్ణ, ఉదయ, యమునగా గుర్తించారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. ఇల్లు కూలిన ప్రాంతానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు.