రామమందిర ప్రారంభోత్సవం.. ఆ ఐదుగురు జడ్జిలకు ఆహ్వానం

రామమందిర ప్రారంభోత్సవం.. ఆ ఐదుగురు జడ్జిలకు ఆహ్వానం

అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్నిరంగాల ప్రముఖులు హాజరుకానున్నారు..తాజాగా రామ మందిరంపై చారిత్రాత్మక తీర్పును ఇచ్చిన ఐదుగురు  న్యాయమూర్తులను ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించారు. 

2019లో అయోధ్య రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన  ఐదుగురు జడ్జీలు అందులో ప్రస్తుత సీజేఐ చంద్రచూడ్, మాజీ సీజేఐ  రంజన్ గొగోయ్, ఎస్ ఏ, బాబ్డే,  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఎస్. అబ్దుల్ నాజీర్ ఉన్నారు.  

అయోధ్యలో శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది..2024, జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. అంటే కేవలం 84 సెకన్లు.. అంటే ఒకటిన్నర నిమిషం కూడా లేదు.. కేవలం 84 అంటే 84 సెకన్లు.. ఈ 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది.. ఇది ఎంతో అద్భుతమైన, శుభకరమైన ముహూర్తం అంట.. లేకపోతే అయోధ్యలో రాముడికే ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారు.. అందుకే ఈ దివ్యమైన.. మంగళమైన ముహూర్తం అని భావిస్తున్నారు జనం.