
గుజరాత్ వడోదరలోని పద్రాలో ఉన్న గ్యాస్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఎయిమ్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో శనివారం పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
పరిశ్రమలు, వైద్యరంగానికి అవసరమైన గ్యాస్‌లను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్ ఇతర వాయువులను ఎయిమ్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారు చేస్తుంది.