
భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్ తీవ్రం కావడంతో మహారాష్ట్రలోకి ప్రవేశించిన మావోయిస్టుల కోసం సీ-60 బలగాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో లాహేరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవుల్లో బలగాలకు మావోయిస్టులు కనిపించారు.
దీంతో డివిజనల్ కమిటీ మెంబర్, ఏరియా కమిటీ మెంబర్‌తో పాటు మరో ముగ్గురు ప్లటూన్ సభ్యులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిపై మొత్తం రూ.36 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌తో పాటు రెండు 303 గన్స్, మూడు సింగిల్ షాట్ రైఫిల్స్, బర్మార్ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.