
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్‌ఆర్‌టిసి బస్సు ప్రమాదానికి గురికావడంతో కనీసం నలుగురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్, ఒక మహిళ, నేపాలీ జాతీయుడు ఉన్నారు. సంఘటన సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) రాజీవ్ శంఖాయన్ తెలిపారు. బిర్మా దేవి, ధన్ షా అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, బస్సు డ్రైవర్ కరమ్ దాస్ మరియు కండక్టర్ రాకేష్ కుమార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు సిమ్లా పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రోహ్రులోని సివిల్ ఆస్పత్రికి తరలించారు.