మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ

మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులను  ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ గా రాజర్షి షాను నియమించారు. మెదక్​ కలెక్టర్​ స్థానం నుంచి రాహుల్ రాజ్ ను ఆదిలాబాద్ కలెక్టర్ గా బదిలీ చేశా రు. ఇక  కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్ గా  స్నేహ శబరీశ్ ని నియమించారు. హైద రాబాద్ అదనపు కలెక్టర్ గా హేమంత కేశవ పాటిల్ ను,  జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా బీ.హెచ్.సహదేవరావును అపాయింట్ చేశారు. 

పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో మూడేండ్లకు పైగా పనిచేస్తున్న ఐఏఎస్​లను బదిలీ చేయాలని ఈసీ ఇటీవల ఆదేశించింది. అందుకు అనుగుణంగానే ట్రాన్స్​ఫర్లు జరిగాయి. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లు కూడా ట్రాన్స్ ఫర్ అయ్యారు.  జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పర్సా రాంబాబు, హనుమకొండ అదనపు కలెక్టర్ గా ఎ.వెంకట్ రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్ గా బీఎస్.లత, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ గా డి.వేణుగోపాల్, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గా సీహెచ్ మహేందర్ బదిలీ అయ్యారు.