
నల్గొండ జిల్లాలో ఐదుగురు కానిస్టేబుళ్లకు ప్రమోషన్ వచ్చింది. ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) ప్రమోషన్ పొందిన వారికి పట్టీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
ప్రమోషన్లు పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఐదుగురిని అభినందించి బ్యాడ్జీలు అందించారు ఎస్పీ. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్.ఐలు సంతోష్, శ్రీను పాల్గొన్నారు.
►ALSO READ | హైదరాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ ట్రైన్స్.. ఈసారి ఏ రూట్లో అంటే..