
పూంచ్: జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లా సూరన్‌కోట్‌లో ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లకు మధ్య సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. వీరి కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం అండగా ఉంటానని ప్రకటించింది. అమర జవాన్ల ఫ్యామిలీలకు రూ.50 లక్షల నగదుతోపాటు కుటుంబంలో ఒకరికి సర్కార్ ఉద్యోగం ఇస్తామని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నాయక్ సుబేదార్ జస్వీందర్ సింగ్, నాయక్ మన్ దీప్ సింగ్, గజ్జన్ సింగ్, వైశాఖ్, సరాన్ సింగ్ కుటుంబాలను ఆదుకుంటామన్నారు.