ప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం: ఐదుగురు విద్యార్థులు మృతి

ప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం: ఐదుగురు విద్యార్థులు మృతి

కర్ణాటక: ప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల్ లో జరిగింది. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన  జెండాను ఆదివారం తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఐదుగురు పిల్లలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.  హాస్టల్ మొదటి అంతస్తులో జెండా ఉంది.. ముందుగా  జెండాను  ఇద్దరు పిల్లలు తీస్తే ప్రయత్నంలో… వారికి కరెంట్ షాక్ కొట్టిందని… దీంతో పక్కనే ఉన్న ముగ్గురు విద్యార్థులు వారిని రక్షించడానికి వెళ్లారని … ప్రమాదవశాత్తు.. వాళ్లందరు చనిపోయారని తెలిపారు. చనిపోయిన వారిలో మళ్లికార్జున్, బస్వరాజ్, దేవరాజ్, గణేష్, కుమార్ ఉన్నారని అన్నారు.

కొప్పల్ డిఫ్యుటీ కమిషనర్ పి. అనిల్ కుమార్ సంఘటనా స్థలాన్ని సంధర్శించారు. హాస్టల్ వార్డెన్, బిట్డింగ్ ఓనర్, గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు

మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కర్ణాటక సీఎం యడియూరప్ప సంతాపాన్ని తెలిపారు. దీంతో పాటు ప్రతీ కుటుంబానికి 5లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.