శర్వానంద్ మూవీ మనమే టైటిల్‌‌ ఫిక్స్..ఫస్ట్ లుక్‌‌ విడుదల

శర్వానంద్ మూవీ మనమే టైటిల్‌‌ ఫిక్స్..ఫస్ట్ లుక్‌‌ విడుదల

వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు శర్వానంద్. బుధవారం తన పుట్టినరోజు. ఈ సందర్భంగా శర్వా కొత్త చిత్రం ఓపెనింగ్‌‌తో పాటు మరో రెండు చిత్రాల నుంచి అప్‌‌డేట్స్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 35వ చిత్రం చేస్తున్నాడు శర్వా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. శర్వా బర్త్ డే సందర్భంగా ‘మనమే’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేశారు. 

లండన్ నేపథ్యంలో న్యూ ఏజ్ రోమ్ కామ్‌‌గా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు మోషన్ పోస్టర్‌‌‌‌లో చూపించారు. కృతిశెట్టి ఇందులో హీరోయిన్. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రన్ రాజా రన్, ఎక్స్‌‌ప్రెస్ రాజా, మహానుభావుడు చిత్రాల తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌లో మరో సినిమా చేస్తున్నాడు శర్వానంద్. శర్వా కెరీర్‌‌‌‌లో ఇది 36వ చిత్రం. ‘లూజర్‌‌‌‌’ ఫేమ్ అభిలాష్ కంకర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఓపెనింగ్‌‌ బుధవారం జరిగింది. 

మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో లవ్‌‌, డ్రీమ్ ప్రధానాంశాలుగా తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. ఇందులో శర్వా బైక్ రేసర్‌‌‌‌గా నటిస్తున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా జె యువరాజ్ డీవోపీగా పని చేస్తున్నారు. ఇక శర్వా 37వ చిత్రాన్ని ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్, ఎకె ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. శర్వానంద్‌‌ను హ్యుమరస్ క్యారెక్టర్‌‌‌‌లో చూపించబోతున్నామంటూ, బర్త్‌‌డే సందర్భంగా అనౌన్స్‌‌మెంట్ పోస్టర్‌‌‌‌తో విషెస్ చెప్పారు మేకర్స్. విశాల్ చంద్ర శేఖర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.