ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్.. నయా ఫీచర్లతో ఆరు కొత్త ఫోన్లు

V6 Velugu Posted on Sep 21, 2021

బిజినెస్: ఈ కామర్స్ సైట్లు ప్రతి పండుగకు ఏవో కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్‎లైన్ సంస్థ ఫ్లిప్‎కార్ట్.. దసరా పండుగను పురస్కరించుకొని స్మార్ట్‎ఫోన్ల మీద సేల్‎ను ప్రకటించింది. దానికి సంబంధించిన సేల్‎ను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్ లో ఆరు ప్రముఖ కంపెనీలు తమ కొత్త ఫోన్లను విడుదల చేయనున్నాయి. మోటరోలా, ఒప్పో, పోకో, రియల్‌మీ, శామ్‌సంగ్ మరియు వివో కంపెనీలు తమ కొత్త ఫోన్లను మార్కెట్‎లోకి తీసుకురానున్నాయి.

రియల్‌మీ కొత్తగా నార్జో 50 సిరీస్ ఫోన్‎ను సెప్టెంబర్ 24న విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ నార్జో 50 మరియు నార్జో 50 ప్రో మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా రియల్‌మీ టీవీలకు సంబంధించి రియల్‌మీ బ్యాండ్ 2 మరియు స్మార్ట్ టీవీ నియో 32 అంగుళాల టీవీలను  కూడా లాంచ్ చేసే అవకాశాలున్నాయి.

ఇక మరో కంపెనీ ఒప్పో కూడా ఒప్పో A55ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 27న ఫ్లిప్‎కార్ట్‎లో అందుబాటులోకి రానుంది. 

మరో ప్రముఖ కంపెనీ శామ్‌సంగ్.. సెప్టెంబర్ 28న గెలాక్సీ M52 5Gని లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రదర్శించబోతోంది. కాగా.. గెలాక్సీ M52 5G ఫోన్ అమెజాన్ ద్వారా లాంచ్ చేయబడుతుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకు సైట్‎లో అందుబాటులోకి వస్తుందని శామ్‌సంగ్ ట్వీట్ చేసింది.‎ M52 5G ఫోన్ అమెజాన్‎లో విడుదల కాబోతోంది కాబట్టి.. ఫ్లిప్‎కార్ట్‎లో మరో ఫోన్ విడుదలవుతుందని తెలుస్తోంది.

కాగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021లో మోటరోలా మరియు పోకో కంపెనీలు ఏ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తాయనే సమాచారం ఇంకా తెలియలేదు. కానీ, తమ కొత్త మోడళ్లను మాత్రం విడుదల చేస్తామని కంపెనీలు ప్రకటించాయి. పోకో మరియు వివో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్ 30న లాంచ్ చేయనున్నాయి. అదేవిధంగా మోటరోలా కూడా తన కొత్త ఫోన్‌ను అక్టోబర్ 1న లాంచ్ చేయనుంది. అయితే సేల్ ప్రారంభమైతే తప్ప వీటి ధరల గురించి తెలిసే అవకాశం లేదు.

Tagged vivo, Oppo, Dussehra, Flipkart, samsung, Smartphones, Festive offers, Realme, Motorola, Flipkart Big Billion Days, Poco, New Smartphones

Latest Videos

Subscribe Now

More News