
ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ కూడా న్యూ ఫ్రీడమ్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ ద్వారా ఆపిల్, శామ్‌సంగ్, నథింగ్, రియల్‌మీ, వివో, మోటరోలా వంటి బ్రాండ్‌ల నుండి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు VIP & ప్లస్ సభ్యులకు ఆగస్టు 1న అర్ధరాత్రి నుండి, సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్రెష్ లేటెస్ట్ సేల్ మరో ఎనిమిది రోజుల పాటు ఉంటుంది. అలాగే ఇంకొన్ని రోజుల కూడా పొడిగించే అవకాశం ఉంది.
ఆఫర్స్ ఏంటంటే : ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుతో షాపింగ్ చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తుంది, ఈ అఫర్ EMI అప్షన్ పై కూడా వర్తిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌లతో పాటు నో-కాస్ట్ EMI అప్షన్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఎక్స్ట్రా సేవింగ్స్ కోసం సూపర్ కాయిన్‌లను రీడీమ్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది.
స్మార్ట్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ అఫర్ :
*ఐఫోన్ 16 లాంచ్ ధర రూ. 79,900 కానీ మీరు ఈ సేల్ లో రూ. 69,999కే సొంతం చేసుకోవచ్చు,
*మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ ధర రూ.25,999 కానీ డికౌంట్ ధర రూ.20,999 అందిస్తుంది.
*మీరు Samsung Galaxy S24 FEని కేవలం రూ.35,999కే షాపింగ్ చేయవచ్చు, అయితే దీని MRP ధర రూ.59,999.
*Samsung Galaxy S24 కూడా భారీ తగ్గింపుతో ఇప్పుడు రూ.46,999కి లభిస్తుంది. అయితే దీని లాంచ్ ధర రూ.74,999.
*ఐఫోన్ 16e ని రూ.54,900కే ఇంటికి తీసుకెళ్లొచ్చు, దీని లాంచ్ ధర రూ.59,900 అంటే భారీ తగ్గింపుకే వస్తుంది.
*నథింగ్ ఫోన్ 3a లాంచ్ ధర రూ.27,999 పై మంచి డిస్కౌంటుతో రూ.21,999కి వస్తుంది.
*ఇక Vivo T4 5Gని రూ.20,999కి కొనవచ్చు, దాని లాంచ్ ధర రూ.21,999.