ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ పెడితే.. 10 నిమిషాల్లోనే డెలివరీ

ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్  పెడితే.. 10 నిమిషాల్లోనే  డెలివరీ

హైదరాబాద్, వెలుగు:ఈ–కామర్స్​ ప్లాట్​ఫారమ్ ​ఫ్లిప్​కార్ట్​ హైదరాబాద్​లో మినిట్స్​సేవలను మొదలుపెట్టింది. దీంతో పది నిమిషాల్లోనే ఆర్డర్లను డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం హైదరాబాద్‌‌‌‌లోని నిజాంపేట, వనస్థలిపురం వంటి ముఖ్య ప్రాంతాల్లో మైక్రో ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్​ సెంటర్‌‌‌‌లను (ఎంఎఫ్​సీలు) ప్రారంభించింది.

మినిట్స్​​ద్వారా ప్యాకేజ్డ్​ ఫుడ్, పర్సనల్​ కేర్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్,  రోజువారీ నిత్యావసరాలను ఆర్డర్​ చేయవచ్చు. అమ్మమాస్, సిద్దిపేట, కోథాస్, ఫ్రీడమ్​ ఆయిల్ వంటి స్థానిక బ్రాండ్‌‌‌‌ల ఉత్పత్తులను అందిస్తామని ప్రకటించింది.  మినిట్స్​ వల్ల హైదరాబాద్​నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని ఫ్లిప్​కార్ట్​ తెలియజేసింది.