
హైదరాబాద్, వెలుగు: రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్‌పిఓలు), సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు (ఎస్‌హెచ్‌జీ) మార్కెట్లో అవకాశాలను కల్పించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)తో శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై ఫ్లిప్‌కార్ట్ సంతకం చేసింది.
ఫ్లిప్‌కార్ట్ & ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) - ఐఐఎంఆర్ మధ్య ఎంఓయూ డాక్యుమెంట్ల మార్పిడి జరిగింది. ఫలితంగా ఫ్లిప్‌కార్ట్‌లోని 40 కోట్ల మందికిపైగా కస్టమర్లకు స్థానిక వ్యవసాయ సంఘాల, ఎస్‌హెచ్‌జీల ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి.
ఐకార్–-ఐఐఎంఆర్తో ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఫ్లిప్‌కార్ట్ రైతులకు ట్రైనింగ్ ఇస్తుంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఎఫ్‌పీఓ ఎకోసిస్టమ్‌లో భాగం కావడానికి అవసరమైన నాణ్యత, ధరలు, లైసెన్సుల గురించి వారికి అవగాహన కల్పిస్తుంది.