Flipkart slumps: రెండేళ్లలో ఫ్లిప్కార్ట్ ఆదాయం 41వేల కోట్లు తగ్గింది

Flipkart slumps: రెండేళ్లలో ఫ్లిప్కార్ట్ ఆదాయం 41వేల కోట్లు తగ్గింది

రెండేళ్లలో ఫ్లిప్కార్ట్ ఆదాయం భారీగా తగ్గింది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాతృసంస్థ వాల్ మార్ట్ నిర్వహించిన ఈక్విటీ లావాదేవీల ప్రకారం.. జనవరి 2022 తో పోలిస్తే జనవరి 2024 నాటికి 5 బిలియన్ డాలర్లు అంటే రూ. 41వేల కోట్లు తగ్గింది.  వాల్ మార్ట్ డేటా ప్రకారం.. జనవరి 31, 2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్ కార్ట్ వాల్యూవేషన్ 40 బిలియన్ డాలర్లు ఉండగా.. జనవరి 31, 2024 నాటికి ఈ కామర్స్ సంస్థ విలువ రూ. 35 బిలియన్ డాలర్లకు తగ్గింది. 

ఫిన్ టెక్ సంస్థ, Phone pe ని ప్రత్యేక కంపెనీగా విడదీయడమే వాల్యూవేషన్ లో క్షీణతకు కారణమని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. అయితే ఫ్లిప్ కార్ట్ ప్రస్తుత వాల్యూవేషన్ రూ. 38-40 బిలియన్ల శ్రేణిలో ఉంది తెలుస్తోంది. 

2022 ఆర్థిక సంవత్సరంలో వాల్ మార్ట్  8శాతం ఈక్విటీని ఫ్లిప్ కార్టులో 3.2 బిలియన్ డాలర్లకు తగ్గించింది. ఇది ఈ కామర్స్ ఎంటర్ ప్రైజెస్ విలువను 40 బిలియన్ డాలర్లుగా మార్చింది.2023లో ఫ్లిప్ కార్టు రూ. 4,846 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2023లో నికర మొత్తం రూ. 56,0128.8 కోట్లుగా నమోదు చేసింది. అయితే 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చులు 60,858కోట్లు.