నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద..8 గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద..8 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలు, శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జునా సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం ( సెప్టెంబర్7) ఉదయం ప్రాజెక్టుకు వరద పెరగడంతో 8 క్రస్టు గేట్టు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు నిరంతరాయంగా ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

ఆదివారం ఉదయం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు లక్షా 18వేల 173 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో ఉండగా..అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 311.1486 టీఎంసీలుగా ఉంది. 

ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.