తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువన నది పరివాహక ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండడంతో ప్రాజెక్టుకు వరద అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పెరుగుతున్న వరద ప్రవాహానికి అనుగుణంగా అధికారులు డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 7 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
తాలిపేరు ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో.13 వేల 775 క్యూసెక్కులుగా ఉంది. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వస్తున్న ఇన్ ఫ్లోకు అనుగుణంగా గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా.. అధికారులు  73.37 మీటర్లు నీటిమట్టం కొనసాగిస్తూ వరద ప్రవాహాన్ని నియంత్రిస్తున్నారు.