వరద సాయం కోసం భారీ క్యూలు…మీ సేవ చార్జీల బాదుడు

వరద సాయం కోసం భారీ క్యూలు…మీ సేవ చార్జీల బాదుడు

హైదరాబాద్ లో వరద సాయం కోసం బాధితులు మీ సేవా సెంటర్ల వద్ద భారీ క్యూ కట్టారు.  వరద సాయం అందనివారు  మీ సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకుంటే, పరిశీలించి సాయం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.  దీంతో రాంనగర్ లోని మీ సేవా సెంటర్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే క్యూ కట్టారు వరద బాధితులు. కరోనా టైంలోనూ రోడ్లపై బారులు తీరారు. రాంనగర్ ఒక్క చోటే కాదు, హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో మీ సేవా సెంటర్ల ముందు క్యూ కనపడ్తోంది. ఇదే అదునుగా తీసుకున్న మీ సేవా నిర్వాహకులు  చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే వరద సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలు రాజకీయ చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇదంతా జీహెచ్ఎంసీ ఎన్నికల స్టంట్ అని విమర్శిస్తున్నారు.

కల్వర్ట్ ను ఢీ కొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

అమల్లోకి TS బీపాస్.. వచ్చే ఏడాది కొత్త GHMC చట్టం